• Login / Register
  • BiTCoin @ 80K Dollers | $ 80 వేలకు డాలర్ల చేరుకున్న బిట్ కాయిన్

    BiTCoin @ 80K Dollers | $ 80 వేలకు డాలర్ల  చేరుకున్న బిట్ కాయిన్
    ట్రేడింగ్‌లో 4.3 శాతం పుంజుకున్న కాయిన్‌

    Hyderabad : అమెరికా నూతన అధ్య‌క్షుడుగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్న డోనాల్డ్ ట్రంప్ త్వ‌ర‌లోనే  వైట్ హౌస్‌కు తిరిగి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న నేప‌థ్యంలో క్రిస్టో క‌రెన్సీకి బ‌లం చేకూరింది. ఈ క్ర‌మంలో   బిట్‌కాయిన్ $ 80,000 దగ్గర పెరిగింది. డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల విజయం తర్వాత బిట్‌కాయిన్ రికార్డు గరిష్ట స్థాయి దాదాపు $ 80,000కి చేరుకుంది, ఇది డిజిటల్ ఆస్తులకు ప్రోత్సాహకంగా పరిగణించబడుతుంద‌ని ఆర్థిక విశ్వేష‌కులు చెప్పుతున్నారు. అయితే ఆదివారం ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ అసాధారణ రీతిలో 4.3 శాతం పుంజుకుని 79,771 డాలర్లకు చేరుకున్నది. సింగపూర్ మార్కెట్లో ఆదివారం మధ్యాహ్నం 2.05 గంటల వరకూ 79 వేల డాలర్లకు సమీపంగా నిలిచింది. కార్నాడో, మీమ్ క్రౌడ్ ఫేవరెట్ డోజ్ కాయిన్ వంటివి కూడా పుంజుకున్నాయి. అయితే మొత్తంగా 2024లో బిట్ కాయిన్ విలువ సుమారు 90 శాతం పెరిగింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గించడంతోపాటు డెడికేటెడ్ యూఎస్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ డిమాండ్ పెరగడం బిట్ కాయిన్ విలువ అభివృద్ధి చెందడానికి కారణమైంద‌ని విశ్లేషకులు చెప్పుతున్నారు.
    *  *  *

    Leave A Comment